‘శంకరాభరణం’లో నాకు అల్లు రామలింగయ్యే హీరో

శంకరాభరణం నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో! ఏ సినిమా గురించైనా తలచుకున్నా లేదా మాట్లాడుకున్నా సహజంగా అది హీరోతోనే మొదలవుతుంది. నాకు ఈ సినిమా గురించి తలచుకున్నప్పుడల్లా మొదట అల్లు రామలింగయ్య గుర్తుకు వస్తారు. ఆ తరువాతే సోమయాజులు గుర్తుకు వస్తారు. అందుకే, నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో! ఈ సినిమాకు ఆరోహణ, అవరోహణ శంకర శాస్త్రి అయితే తాళం మాధవాచార్యులు. తాళం లేకుండా ఒట్టి స్వరాలే ఆలపిస్తే, ఏ రాగమైనా…

Voice Of Legends

30 నవంబర్, 2019న హైదరాబాదులో జరిగిన Voice of Legends సంగీత విభావరిలో పాల్గొంటున్న గాయకుల గురించి నేను వ్రాసిన పరిచయం. సమయాభావం వల్ల ఇది ఆరోజు వినబడలేదు. అందుకే ఇక్కడ పంచుకుంటున్నాను. శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రతీ చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. అవి లేకపోతే చరిత్ర గొప్పగా లేకపోవడమే కాకుండా కొన్నిసార్లు ఊహకు కూడా అందదు. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి ఒక ముఖ్యమైన ఘట్టం, 1967లో సంగీత దర్శకులు శ్రీ…

సైరా నరసింహారెడ్డి (2019)

యుద్ధంలో ఒక్కోసారి పోరాడే వీరుడికన్నా అతడిని నడిపించే సారథే ముఖ్యం. ఇది మహాభారతం సైతం చాటిన సత్యం. సినిమా విషయంలో కూడా అంతే. ఒక్కోసారి కథ, కథనాల కన్నా వాటిని తెరపై నడిపించే నటులే ముఖ్యమైపోతుంటారు. అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. ఎటువంటి కథలకు ఎలాంటి నటులను ఎంపిక చేసుకోవాలో దర్శకుడికి స్పష్టత ఉంటే చాలు. అలా, సినిమాల్లో కాస్టింగుకున్న ప్రాముఖ్యతను చాటే చిత్రమే ‘సైరా నరసింహారెడ్డి’. ‘మెగాస్టార్ చిరంజీవి’ నటించిన 151వ సినిమా ఇది. అతడి…