సంకీర్తన (1987) – నా విశ్లేషణ
సంకీర్తన – ఈ చిత్రం గురించి చాలా మందికి తెలియదు అనే అనుకుంటాను నేను. కె. విశ్వనాథ్ గారి దగ్గర సహాయకుడిగా పని చేసిన గీతాకృష్ణ ఈ చిత్రానికి దర్సకత్వం వహించారు. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన ఈ చిత్రం ఎక్కువ పేరు సంపాదించినట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఈ చిత్ర విశ్లేషణలోకి వెళ్దాం… కథ : ఈ చిత్రపు కథ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో జరుగుతుంది. పాతకాలపు సమాజంలోని మూఢ నమ్మకాలు, వర్ణ విబేధాలు…