ఐ (2015)

సినీ పరిశ్రమలో ఏళ్ళ తరబడి ఒక దారిలో ప్రయాణం చేసిన కొందరు దర్శకులు అమాంతం దారిని మారిస్తే ఆ విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అదే జరిగింది దిగ్గజ దర్శకుడు “శంకర్” విషయంలో కూడా. తన మొదటి చిత్రం “జెంటిల్మెన్” నుండి “శివాజీ” వరకు సృజనాత్మకతతో పాటు సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తూ వచ్చాడు. తన “రోబో” చిత్రంలో సందేశం లేకపోయినప్పటికీ అందులోని అబ్బురపరిచే దృశ్యాలతో “సందేశం” గురించి ప్రేక్షకుడు మరిచిపోయేలా చేశాడు. అలాంటి శంకర్ తన “అపరిచితుడు”…

గోపాల గోపాల (2015)

ఒక భాషలోని చిత్రాన్ని మరో భాషలో పునర్నిర్మించడం మన చిత్రసీమలోని పాత పోకడ. ఈ పోకడ చిత్రాలకు పెట్టింది పేరు “విక్టరీ” వెంకటేష్. ఇదే దారిలో వెళ్ళి విజయాలు సాధించిన మరో కథానాయకుడు పవన్ కళ్యాణ్. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం “గోపాల గోపాల”. ఇది హిందీ చిత్రం “ఓ మై గాడ్” ఆధారంగా రూపొందించబడింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, తడాఖా చిత్రాలతో సుపరిచయం అయిన కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వం వహించారు. సురేష్ బాబు,…

ముకుంద (2014)

సినిమాకు కొన్ని ప్రమాణాలు అవసరం. మరికొన్ని ప్రమాణాలు మరింత అవసరం. ఈ మధ్య వచ్చే చిత్రాల్లో “మరింత అవసరం” నుండి “అవసరం” కు వెళ్ళిన మొదటి ప్రమాణం “కథ“. కథ లేకపోయినా “కథనం” బాగుంటే విజయం సాధించవచ్చు అని కొన్ని చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుత చలనచిత్రాలకు కథకన్నా కథనమే ముఖ్యమైనది. దానికి సహజత్వం, స్పష్టత తోడై ప్రేక్షకుడు పాత్రల్లో తనను, కథనంలో తన జీవితాన్ని చుసుకోగలిగేలా చేస్తే అభినందనలు తప్పవు. అలాంటి ప్రమాణాలతో చిత్రాలు తీసే దర్శకుల్లో శ్రీకాంత్…