టెంపర్ (2015)

పరిశ్రమలో “నటులు”గా చెప్పుకునే కథానాయకుల జాబితాలో ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి పాత్రైనా పోషించగల దమ్మున్న కథానాయకుడు. కానీ ఈ మధ్య కాలంలో సరైన విజయం అందుకోలేక అటు అభిమానుల్ని, సరైన సినిమాలు చేయక ఇటు ప్రేక్షకుల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అలాంటి సమయంలో ఆంధ్రావాలా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మళ్ళీ నటిస్తున్నాడని తెలిసి అందరు ఆశ్చర్యపోయారు. ఆ చిత్రాన్ని గుర్తుచేసుకొని ఈసారి కూడా పరాజయమే అనుకున్నారు అంతా. కానీ వారందరి ఆలోచనలను, ఆశ్చర్యాలను ఛేదిస్తూ,…

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)

జీవితంలో ఊహలుంటాయి, జ్ఞాపకాలుంటాయి. సినిమా విషయంలో కూడా అంతే. ఊహలకు రూపకల్పన చేయవచ్చు లేదా జ్ఞాపకాలకు తెర రూపాన్ని ఇవ్వొచ్చు. ఊహలు, జ్ఞాపకాల మిళితమే “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” అనే చిత్రం. “ఓనమాలు” చిత్రంతో అభినందనలు పొందిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్య మీనన్ జంటగా, సుప్రసిద్ధ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రం. దీని విశేషాల్లోకి వెళ్తే… కథ : ఖేల్ రత్న పురస్కార గ్రహీత అయిన రాజారాం (శర్వానంద్),…