జిల్ (2015)
“సినిమాకు కావాల్సింది ఇద్దరే. ఒకరు నిర్మాత, మరొకరు ప్రేక్షకుడు” అని ఓ కార్యక్రమంలో “దాసరి నారాయణరావు” అన్నారు. అది అక్షరాలా నిజం. నిర్మాతే సినిమాకు పునాది. అతడిచ్చే ఖర్చు, ప్రోత్సాహాలే సినిమా భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అలాంటి నిర్మాణ సంస్థల్లో “యు.వి.క్రియేషన్స్” సంస్థని ఒకటిగా చెప్పుకోవచ్చు. వీరు నిర్మించిన “మిర్చి”, “రన్ రాజా రన్” చిత్రాలు వారి ప్రోత్సాహానికి ఉదాహరణలు. ఇప్పుడు గోపీచంద్, రాశి ఖన్నా జంటగా ఈ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన “జిల్” చిత్రం ద్వారా “రాధాకృష్ణ కుమార్”…