ఉత్తమ విలన్ (2015)

చిత్రసీమలో ప్రత్యేకమైన చిత్రాలు రావడం ఎంత “అరుదో”, కమల్ హాసన్ నటించిన ప్రతి చిత్రం ఎదో ఒక ప్రత్యేకతను సంతరించుకోవడం అంత “సహజం”. ఏ ప్రత్యేకత లేని చిత్రాన్ని కమల్ చేయరు. అలాంటి ఓ ప్రత్యేకమైన చిత్రమే “ఉత్తమ విలన్”. ఈ చిత్రం పేరే ఒక ప్రత్యేకం. దీని కథ, కథనాలను కమలే అందించారు. మరో సుప్రసిద్ధ (famous) నటుడు “రమేష్ అరవింద్” దర్శకత్వం వహించారు. అలనాటి మేటి దర్శకులు కె.బాలచందర్, కె.విశ్వనాధ్ ముఖ్య పాత్రలు పోషించారు.…