కంచె – సంగీత విశ్లేషణ
సినీ సమీక్షలు, విశ్లేషణలు వ్రాసే నేను ఎప్పటినుంచో సంగీతంపై కూడా విశ్లేషణ వ్రాద్దామని అనుకుంటున్నాను. కానీ విశ్లేషణలు వ్రాయలనిపించేంత సాహిత్యం, సంగీతం ఈ మధ్య కాలంలో నేను వినలేదు. “క్రిష్” దర్శకత్వంలో రాబోయే “కంచె” చిత్రంలోని గీతాలు మనసారా మంచి సాహిత్యం వినాలనే నా కోరికను తీర్చడమే కాకుండా తెలుగు సినిమా సాహిత్యం ఇంకా “బ్రతికే” ఉందన్న విషయాన్ని కూడా తెలియజేసింది. ఇందుకు కారణం శ్రీ “సిరివెన్నెల” సీతారామశాస్త్రి గారే. అనేక సంవత్సరాలుగా నా హృదయ సామ్రాజ్యాన్ని తన…