డైనమైట్ (2015)

IMG_20150905_085154

ఓ చిత్రాన్ని మరో భాషలోకి దిగుమతి చేసుకున్నప్పుడు ఆ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేయాలి. కానీ వాటి వల్ల మూల కథ, కథనాలకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఆ లెక్క కాస్త తప్పిన చిత్రం “డైనమైట్”. మంచి విష్ణు, ప్రణీత జంటగా “దేవ కట్టా” దర్శకత్వం వచించిన ఈ చిత్రం తమిళ చిత్రం “అరిమ నంబి” ఆధారంగా రూపొందింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు దీన్ని నిర్మించారు.

కథ :

ఓ సందర్భంలో ఒకరికొకరు పరిచయమవుతారు శివాజీ (విష్ణు), అనామిక (ప్రణీత). ఆ తరువాత అనామిక అపహరణకు (kidnap) గురవుతుంది. ఆమెని కాపాడటానికి ప్రయత్నించిన శివాజీ ఏయే విషయాలు తెలుసుకున్నాడు. అతడి జీవితం ఎలా మారిపోయింది అన్నది ఈ చిత్ర కథాంశం.

కథనం :

ఇది కథనమే ప్రాణమైన ఓ మామూలు కథ. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తించేలా కథనాన్ని మొదటి సగంలో బాగానే నడిపించాడు దర్శకుడు దేవ కట్టా. నాయికానాయికల పరిచయాలకు, వారిద్దరి స్నేహానికి ఎక్కువ సమయం వృథా చేయకుండా చిత్రం మొదలయిన 20 నిమిషాల్లోనే అసలు కథలోనికి తీసుకొని వెళ్ళాడు.

అపహరణకు (kidnap) గురైన అనామికను వెతకడానికి శివాజీ చేసిన ప్రయత్నాన్ని చాలా ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు. ఇక్కడ వచ్చే నాగినీడు మొదలయిన వారికి మంచి పాత్రలే లభించాయి. అనామికను కాపాడే సన్నివేశంలోని పోరాట ఘట్టం బాగుంది కాకపోతే నిడివి ఎక్కువగా అనిపించింది. దీనికి ముందు శివాజీ పన్నే వ్యూహం బాగుంది. దీని ద్వారా విరామపు ఘట్టం బాగా పండింది.

చిత్రానికి రెండో సగం ఎంతో కీలకం. కానీ ఇక్కడే కథనం కాస్త నెమ్మదించింది. మెదడుకు పని చెప్పాల్సిన చోట దర్శకుడు పోరాటాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అవి సహనాన్ని పరీక్షించాయి. ఈ మధ్యలో, శివాజీ పోలీసులను తప్పుదారి పట్టించే సన్నివేశం చాలా బాగా వచ్చింది. అలాగే ప్రతినాయకుడు (జేడి చక్రవర్తి) శివాజీని ఆపే ప్రయత్నంలో చక్రవర్తి నటన బాగుంది. భావోద్వేగాలను బయటకు చూపించకుండా నెమ్మదిగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళే పాత్రని బాగా పోషించాడు. పతాక సన్నివేశం (climax) కూడా బాగుంది. కానీ వేగంగా వెళ్తున్న రైలులోకి కథానాయకుడు ప్రతినాయకుడిని తీసుకొని వెళ్ళడం అనే అంశాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టంగా అనిపించింది.

మొత్తానికి ప్రేక్షకుడు ఖర్చుపెట్టిన డబ్బుకి ఓ మోస్తరు న్యాయం చేసే చిత్రమే “డైనమైట్”. దీని తమిళ మాతృక “అరిమనంబి” చూడనివారు ఓసారి తమ సమయాన్ని ఈ చిత్రం కోసం కేటాయించవచ్చు.

ఇక మిగతా విషయాలకు వస్తే, ఈ చిత్రంలో గీతాలు బొత్తిగా అనవసరం. ముఖ్యంగా వేగంగా సాగిపోతున్న కథనంలో నాయకానాయికల మధ్య ఓ గీతాన్ని పెట్టడం ప్రేక్షకుడిని తన మనసును అమాంతం మళ్ళించేలా చేసింది. పంటి క్రింద రాళ్ళలా ఉన్నాయి గీతాలు. పెద్దగా చెప్పుకోదగ్గ సంగీతం కలిగినవీ కావు.

నటనల విషయానికి వస్తే, మంచు విష్ణు నటించే ప్రయత్నం బాగానే చేశాడు. తన దేహ ధారుడ్యం అతడు చేసిన పోరాటాలను నమ్మేలా చేసింది. ప్రణీతకు మామూలు పాత్రే దక్కింది. ప్రతినాయకుడు చక్రవర్తి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా తన క్రింది అధికారితో కలిసి వీడియోను చూసే సన్నివేశంలో మరియు పతాక సన్నివేశంలో అతడి హావభావాలు బాగున్నాయి. ఉన్నది కాసేపే అయినప్పటికీ నాగినీడుకి మంచి పాత్రే దక్కింది. కనిపించిన ఒక్క సన్నివేశంలోనే “వైవా” హర్ష కాస్త నవ్వించాడు.

ఈ చిత్రాన్ని చూడటానికి మొదటి కారణం “దేవ కట్టా”. అతడు వ్రాసే బరువైన మాటలకు అభిమానులుగా ఉన్నవారికి నిరాశే మిగులుతుంది. ఈ చిత్రంలో మాటలకు పెద్దగా పనిలేదు కనుక బీవీఎస్ రవి మాటలు వ్రాశాడు. కట్టా కేవలం కథనం, దర్శకత్వం చేశాడు. ఏదేమైనా ఇందులో మాటలు చెప్పుకోదగ్గవి కావు.

ప్రత్యేకతలు :

  1. కథనం. ఎంత రీమేక్ చిత్రమైనప్పటికి, కథనంతో ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగించే ప్రయత్నం బాగా చేశాడు దర్శకుడు దేవ కట్టా.
  2. చిన్నా నేపథ్య సంగీతం. ఇలాంటి కథనాలకు నేపథ్య సంగీతమే ప్రాణం. ఆ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాడు చిన్నా.
  3. పరిమిత ఖర్చు (Limited Budget). గమనించి చూడగా, ఈ చిత్రానికి ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అనిపించలేదు. తక్కువలో ముగిసిపోయినట్టుగా ఉంది.

బలహీనతలు :

  1. మితిమీరిన పోరాటాలు. మెదడుకు పని చెప్పకుండా ఎక్కువ చేతికి పని చెప్పి మూల కథనానికి దెబ్బ కొట్టారు.
  2. అనవసరమైన గీతాలు. నిజానికి ఇందులో గీతాలు అక్కర్లేదు. కథానాయకుడు విష్ణు కనుక పెట్టారేమో అనిపించింది. వాటి చిత్రీకరణ కూడా గొప్పగా లేదు.
  3. రెండో సగంలో నెమ్మదించిన కథనం.
  4. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలు రాత్రి సమయంలో జరిగేవి. అలాంటి చోట్ల తక్కువ నాణ్యత గల ఛాయాగ్రహణం ఓ పెద్ద బలహీనతగా అనిపించింది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

కథను బట్టే కథనపు గమనం ఉండాలి కానీ అనవసరమైన విషయాలు చొప్పించి ప్రేక్షకుడిని నొప్పించకూడదు.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

2 thoughts on “డైనమైట్ (2015)

  1. Rod movie, first few mins ok, Heroine kidnap scene nunchi naagineedu death scene varaku bagundi, antehey akkadinunchi emi interest ledu movie narration lo naaku ekkada kooda tension ye kaalagaledu, JD Matram chitakkotaadu esp aa control room murder scene lo expressions change superb

    Yes camera work maree worst ga undi aa matram kharchu chelayaru gaani ee snow batch malli edava OA statements isstaru

    neeku visyaam telusa, except 2,3 scenes JD and Police offers scenes anni tamil nundi lepesaru exact ga :D, inka Item song kooda same to same cut copy paste from tamil movie 😀

    Like

  2. Pingback: Dynamite (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s