కంచె (2015)
అది 2012, సురభి నాటకసంస్థలో “అభిమన్యుడు” మరియు “ఘటోత్కచుడు” నాటకాలు వేసిన రోజు. “మన జీవితాలు మేకప్ కంపు కొడుతున్నాయి. అయినా అందరూ నీ కలలే కనాలంటే ఎలా తాత?” అని బీటెక్ బాబు ముసలి చాదస్తాల పట్ల అసహనాన్ని వ్యక్తం చేయగా, “అది కల! నిద్దట్లో కనేది. ఇది కళ! నిద్దర లేపేది. రేయ్! కళంటే బ్రతుకునిచ్చేదే అనుకోకు! బ్రతుకు నేర్పేది కూడా!” అన్నాడు అతడి తాత హరిశ్చంద్రప్రసాద్. కట్ చేస్తే… అది 1936,…