మన తెలుగు సినిమాలో దర్శకుడికి, కథానాయకుడికి సమానమైన ప్రాముఖ్యత ఉంది. అంటే మార్పుకి దర్శకులతో పాటు కథానాయకులు కూడా నాంది పలకాలి. కానీ కొందరు కథానాయకుల్లో మార్పు అంత సులువుగా రాదు. అలాంటి కథానాయకుడే “రామ్”. ఇతడు కథానాయకుడిగా రూపొందిన “శివమ్” చిత్రం ద్వారా “శ్రీనివాస రెడ్డి” దర్శకుడిగా పరిచయమయ్యారు. “నాయకుడు”, “నువ్వేకావాలి”, “నువ్వు నాకు నచ్చావు”, “యువసేన” లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “స్రవంతి మూవీస్” పతాకంపై “స్రవంతి రవికిషోర్” ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశి ఖన్నా కథానాయిక.
కథ :
ప్రేమించి, పెళ్ళి చేసుకునే ధైర్యం లేని ప్రేమజంటలకు సాయం చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు శివ (రామ్). దాంతో చాలామందితో వైరం పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్న శివకి ఓ రోజు తనూజ (రాశి ఖన్నా) పరిచయమై ఆమె ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను ఎలా పొందాడు? తనను వెతికే శతృవులను ఎలా ఎదురుకొన్నాడు? అనేవి ఈ కథాంశాలు.
కథనం :
అనేక మంచి చిత్రాలను నిర్మించిన ఓ నిర్మాణ సంస్థ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే, దాన్నుండి అలాంటి ఓ చిత్రాన్నే ఆశించడం మామూలు విషయమే. కానీ రవికిషోర్, రామ్ లు సంతోషపరిచే కథను కాకుండా ప్రేక్షకుడు ఇదివరకే చూసి వదిలేసిన వాణిజ్య కథనే ఎంచుకున్నారు. దర్శకుడు కొత్తవాడు అయినప్పటికీ, అతడి కథలో కానీ, కథనంలో కానీ ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు.
ముందుగా మంచి విషయాలు…
ఈ చిత్రంలో పేర్లు పడే సన్నివేశాలు బాగా వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ వచ్చే “స్లో మోషన్ షాట్స్” (slow motion shots) చాలా అందంగా ఉన్నాయి. అందులోనూ, పైన రంగులు, క్రింద పరిగెడుతున్న శివను చూపించిన షాట్ నాకు బాగా నచ్చింది. ఛాయాగ్రాహకుడు “రసూల్” ఇక్కడే పూర్తి మార్కులు కొట్టేశాడు. అక్కడక్కడ హాస్య సన్నివేశాలు బాగా నవ్వించాయి. ఉదాహరణే, శివ తనకు తనూజతో ఇదివరకే సంబంధం ఉందని “తాగుబోతు” రమేష్, “చలాకి” చంటి, “షకలక” శంకర్ లకు చెప్పే సన్నివేశం. ఇందులో “శంకర్” నటన బాగా నవ్వించింది. వీటితో పాటు శివ పాత్రతో తమకున్న సమస్యలను శ్రీనివాస రెడ్డి, బ్రహ్మానందం లాంటి వారు వివరించే సన్నివేశాలూ నవ్వించాయి. అలాగే, “ఫిష్” వెంకట్, సప్తగిరిలు పండించిన హాస్యం కూడా నవ్వించింది. అలా ఈ చిత్రాన్ని కథకన్నా, కథనంకన్నా, కథానాయకుడి కన్నా హాస్యనటులే నెట్టుకొచ్చారు.
ఈ చిత్రంలో గీతాల చిత్రీకరణ చాలా ఆకట్టుకుంది. “ఐ లవ్ యు టూ”, “అందమైన లోకం” గీతాల చిత్రీకరణ నాకు బాగా నచ్చాయి. వీటిలో కూడా రసూల్ పనితనం అద్భుతం. “అందమైన లోకం” గీతంలో నార్వేలో తీసిన ఏరియల్ షాట్స్ (aerial shots) చాలా అందంగా ఉన్నాయి.
ఇక మిగతా విషయాలు…
ఈ చిత్రానికి తెరవెనుక దర్శకుడు “శ్రీనివాస రెడ్డి” అయితే, తెర ముందు మరో దర్శకుడు కూడా ఉన్నాడు. అతడే “ప్రేక్షకుడు”. ఎందుకంటే, తరువాత ఎం జరగబోతోందో అతడు ఇట్టే పసిగట్టగల కథనం ఇది. శివ, తనూజల మధ్య చెప్పుకోదగ్గ ఒక్క అందమైన సన్నివేశం కూడా లేదు. ఒకవేళ ఏదైనా సన్నివేశం వస్తే, అక్కడినుండి ఓ అయిదు నిమిషాల్లో ఓ గీతం వచ్చేస్తుంది. కథానాయకుడు, ప్రతినాయకుడు ఎదురుపడితే ఓ పోరాటం వస్తుంది. ఇలా అన్నీ ప్రేక్షకుడి ఊహలకు అందుతూ, అతడిని కూడా దర్శకుడిని చేసింది ఈ చిత్రం.
ఇదిలావుండగా, ఈ చిత్రంలో ఇబ్బందిపెట్టిన మరో విషయం “నిడివి” (runtime). అసలు సరైన కథ, కథనాలే లేనప్పుడు 168 నిమిషాల చిత్రంతో ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోపెట్టాలని దర్శకనిర్మాతలకు ఎందుకు అనిపించిందో తెలియదు. పైగా “శివ” పాత్రను చిత్రం చివర్లో నెలకొల్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అది కూడా ఒక పాతరకం విషయంతో. అది భావోద్వేగాలను పండించే ప్రయత్నం ఏమాత్రం చేయలేకపోయింది. అప్పటివరకు ఆకతాయిగా ఉన్న కథానాయకుడి పాత్ర ఉన్నట్టుండి వేదాంతం వల్లించడం కూడా బాగోలేదు.
మొత్తానికి చిత్రాన్నిముగించే సందర్భాలు రెండో సగంలో చాలా ఉన్నప్పటికీ, 168 నిమిషాలకు పలు అతిశయోక్తులతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తూ ముగించాడు దర్శకుడు శ్రీనివాస రెడ్డి.
సంగీతం విషయానికి వస్తే, గీతాలు చూడటానికి బాగున్నాయి కానీ పెద్దగా వినదగేవి కావు. “గుండె ఆగి పోతాందే” గీతాన్ని విదేశాల్లో చిత్రించాల్సిన అవసరం లేదనిపించింది.
ఇప్పుడు పాత్రలు…
రామ్ కి దక్కినది అతడు ఎప్పుడు చేసే మూస (routine) పాత్రే. కనుక దాని గురించి, అతడి నటన గురించి మాట్లాడుకోవడం అనవసరం. రాశి ఖన్నాకు పాత్ర ఉన్నట్టే అనిపించింది కానీ దాన్ని ఒప్పించేలా మలచలేకపోయాడు దర్శకుడు. అభిమన్యు సింగ్ తనకు దక్కిన పాత్రను బాగా పోషించాడు. పోసాని కనబడిన ప్రతిసారి సహనాన్ని పరీక్షించాడు. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, కృష్ణభగవాన్ లాంటి పెద్ద హాస్యనటులకన్నా శ్రీనివాస రెడ్డి, “షకలక” శంకర్, “ఫిష్” వెంకట్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను లాంటి వారు బాగా నవ్వించారు. గాయకుడు “మనో” ఈ చిత్రంలో కథానాయిక తండ్రిగా నటించారు.
ప్రత్యేకతలు :
- రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం (cinematography). పైన చెప్పుకున్నట్టుగా, ఈ చిత్రానికి ఉన్న ప్రధాన బలం ఛాయాగ్రహణమే. అందుకు రసూల్ ని మనస్పూర్తిగా అభినందించాలి.
- నిర్మాణ విలువలు (production values). కథ, కథనాలు బలంగా లేకపోయినా, దర్శకుడు కోత్తవాడే అయినా, నిర్మాత రవికిషోర్ ఈ చిత్రానికి ఖర్చుపెట్టడంలో ఎక్కడా వెనుకాడలేదు.
- అక్కడక్కడ పండిన హాస్యం.
- గీతాల చిత్రీకరణ.
బలహీనతలు :
- కథ, కథనాలు (story&screenplay). ఈ చిత్రం ఒక మూస కథ, ఏమాత్రం కొత్తగా లేని కథనాలతో రూపొందించబడింది.
- నిడివి (runtime). విరామంతో కలిపి మూడు గంటల చిత్రంగా ముగిసింది ఈ చిత్రం. ఇలాంటి కథలకు 168 నిమిషాలు చాలా పెద్ద నిడివి.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఎంత విశ్లేషించుకున్నా, ఈ చిత్రంలో పాఠంగా తీసుకోవాల్సిన విషయం ఏది కనబడలేదు. ఓ సినిమా నుండి “ఏదీ” ఆశించని వారిని శివమ్ సంతోషపరుస్తుంది అని మాత్రం చెప్పగలను.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Ram career worst movie after OG,
first 20 mins oka flow lo ellindi aa villan koduku ni kotte scene, heroine intro akkadivaraku fine
anthey inka heroine ventapade scenes asalu aa tokkalo jabardasth batch ni okka scene tho end cheyocchu ga, valledo peekudu gaallu ainattu eedu edava A comedy anukuntu oka toppass flasbhack cheppadam endo
2nd half lo aa goa episode endho emo lepi padeyalsindi, saptagiri maree item comedian type lo aipotunnadu anni waste roles ye
inka cinema aipotadi anukunte oka yedava flashback tokkalo justification kosam
love track, villain scenes edaina annitlo comedy workout cheyalani choosadu evi workout kaaledu except few sreenivas reddy and fish venkat dialogues
aa boojireddy ga esina actor ki oka dandam, edava moham aa dubbingu aadu nu, vantuku vastadi ayya aadini asalu enduku pettukuntaro ,lip sync kooda ivvaledu malli
inka abhimanyu singh gadni clean shave tho .5 laaga choopincaru, climax lo aa luck gurinci malli edho disco adi correcte anta endho asalu
oka routine commercial movie ki 3 hours length endho asalu first movie inta daridramga evadu teeyadu template movie teesi
asalu interval taruvata heroine behaviour ki mamoolu frustration raadu ,mental behaviour ye asala
i love you cheppaaniki ego ento asalu hero anta ga tana kosam kashtapadi save chestey malli oppukovadaniki edava ego thutt ,kaasepu love ledu, malli naaku nuvve dikku, malli manam lovers kaadu
akkada aa fight situation enti ,idi madyalo vacchi i love you cheppuddi aadu navvina okka min aagadu malli aa fight aapeyi anta
inka daridram aadu cheptane untadu phone cheste aallocchestaru ani aina maa ammatho maatalaadali ani edava edupu edisi phone chepistadi debbaki allu vacchestaru next scene
aina asalu prema gurinchi anta feel ayye hero ,love lo pade scene anta formulaic ga pettadam baagaledu .
LikeLike
Pingback: Shivam (2015) | Film Criticism