పులి (2015)

Puli Poster

కొన్ని “కథలు” వినడానికి చాలా బాగుంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో నిద్రపుచ్చుతూ అమ్మ చెప్పిన “చందమామ” కథలు, ఓ వయసొచ్చాక బామ్మ చెప్పిన “కాశీ మజిలీ కథలు”, ఇలా. ఈ కథలు వినడానికి చిన్నవే అయినా, వాటి దృశ్యాలను కళ్ళ ముందు ఉంచాలంటే చాలా సృజనాత్మకత (creativity), ఊహాశక్తి (imagination) కావాలి. కానీ ఆ ఊహలను ప్రేక్షకుడికి ఎలా చేరవేశారనేది చాలా చాలా ముఖ్యం. నేను మాట్లాడుతున్నది చిన్నప్పుడు విన్న కథల గురించి కాదు. ఇళయదళపతి విజయ్ కథానాయకుడిగా “చింబుదేవన్” చెప్పిన ఓ “పులి” కథ గురించి. శృతిహాసన్, హన్సిక విజయ్ కి జోడీలుగా నటించగా, ఒకప్పటి అతిలోక సుందరి “శ్రీదేవి” ఓ ముఖ్యపాత్రను పోషించారు.

కథ :

బేతాళ రాజ్యంలో బేతాళుల నిరంకుశ పాలనకు (dictatorship) ఆ రాజ్యపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అదే రాజ్యంలోని భైరవకొన అనే గూడెంలో పెరిగిన మనోహరుడు (విజయ్) ఆ నిరంకుశత్వాన్ని ఎలా ఎదురుకొని తన ప్రజలను రక్షించుకున్నాడో, అదే ఈ కథాంశం.

కథనం :

పసిపిల్లలకు చెప్పే కథను ఓ సినిమా కథగా ఆవిష్కరించడానికి దర్శకరచయిత చింబుదేవన్ పడ్డ కష్టం చాలా ఉంది. వందకోట్ల విలువగల “కత్తి”ని పట్టిన తరువాత ఇలాంటి జానపద కథలోనూ కత్తి పడతానని ముందుకు వచ్చిన విజయ్ కి ధైర్యం ఎంతో ఉంది. అందుకే ముందుగా వీరిద్దరినీ అభినందించాలి.

ఇక కథనం విషయానికి వస్తే, ఇలాంటి కథలను జాతీయ స్థాయిలో (తెలుగు, తమిళ, హిందీ భాషల్లో) విడుదల చేయాలనుకున్నప్పుడు వారందిరిలో కనీసం యాభై శాతం మంది చూసే విధంగా చిత్రాన్ని మలిచి ఉంటే దర్శకుడు పడ్డ శ్రమకు సరైన ఫలితం దక్కేదేమో. కానీ కేవలం తమిళ ప్రేక్షకులను మెప్పించెందుకే సన్నివేశాలు వ్రాసుకున్నాడు. ఈ విషయం మొదటి సగంలో పలుచోట్ల స్పష్టంగా కనబడుతుంది. అది అతడు చేసిన పెద్ద తప్పు. ఇదిలావుండగా, కథనానికి అడ్డుకట్టలుగా గీతాలున్నాయి.

చిత్రంలో మరుగుజ్జు జాతి మనుషులు, మాట్లాడే పక్షులు, తాబేలు, బేతాళుల కోట ఇలా చాలా విషయాల్లో దర్శకుడి ఊహలు బాగున్నాయి కానీ ఓ కప్ప విషయంలోనూ ఇలాగే అందంగా ఊహించి ఉంటే బాగుండేదేమో. బహుశా ఈ అంశాన్ని హాస్యాన్ని పండించడానికి ఉంచాడేమో తెలియదు కానీ అది జుగుప్సాకరంగా మాత్రం ఉంది. ఎలాగో మొదటి సగాన్ని అటు తన ఊహలతోనూ పూర్తిగా సంతోషపరచక, ఇటు తన కథనంతోనూ మెప్పించలేకపోయాడు చింబుదేవన్.

రెండో సగం మొదటి దానితో పోలిస్తే ఎంతో మేలు. ఇక్కడ కథానాయకుడి పాత్ర ఔన్నత్యాన్ని పెంచే సన్నివేశాలు బాగున్నాయి. ఇందుకు ఉదాహరణ మనోహరుడికి యవన రాణి (శ్రీదేవి) మరియు జలంధరుడు (సుదీప్) పరీక్షలు పెట్టే సన్నివేశం. అప్పటివరకు తమ కథానాయకుడు ఎక్కడ అని వెతుక్కునే అభిమానులను తృప్తిపరిచే సన్నివేశం ఇది. ఆ తరువాత మనోహరుడి తండ్రి కథ “బ్రేవ్ హార్ట్” చిత్రంలోని సన్నివేశంతో మొదలై ఓ రెండు నిమిషాలు ఫరవాలేదనిపించినా ఆ తరువాత పస లేని కథగా ముగిసిపోయింది.

ఇలాంటి విషయాల వల్ల మొత్తానికి “పులి” గాండ్రించకుండా పొరపాటున “మియావ్” (meow) అనేసింది. నాలాంటి విమర్శకులు ఎంతగా ఈ చిత్రాన్ని తక్కువ చేసి వ్రాసినప్పటికీ, ఇందులో చిన్నపిల్లలను అమితంగా ఆకట్టుకునే అంశాలు బోలెడున్నాయి. కనుక కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రం చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఈ చిత్రం విజయం సాధిస్తే అదంతా వారి చలవే అని చెప్పాలి.

గీతాల విషయానికి వస్తే, కథనానికి అడ్డుకట్టలే అన్ని గీతాలు. కానీ “ఏంటి ఏంటి” గీత చిత్రీకరణ అందమైన ప్రదేశాలతో ఆకట్టుకుంది. అలాగే “మన్మధుడా” గీతం కూడా బాగానే ఉంది. “జింగిలియా”, “పిట్ట కళ్ళ” అనే గీతాలు మాత్రం సహనాన్ని బాగా పరీక్షించాయి.

ఇక నటనల విషయానికి వస్తే, విజయ్ కి ఇలాంటి పాత్రలు చేయడం చాలా సులభం. కానీ ఇది అనువాద చిత్రం కనుక విజయ్ పాత్రకి వేరొకరి గొంతుక వినిపిస్తుంది. అక్కడే పాత్రలోని జీవం దెబ్బతింటుంది. ఓ పాత్ర గురించి మాట్లాడాలంటే అది మాట్లాడిన తీరు కూడా ఓ కొలమానం కనుక విజయ్ నటన పట్ల పూర్తి నిర్ధారణ కష్టం. శృతిహాసన్. హన్సికలు మామూలే. శ్రీదేవికి “యవన రాణి” పాత్ర అంతగా నప్పినట్టు అనిపించలేదు. కారణం ఆవిడ ముఖం “యవనం” కోల్పోయి, కళావిహీనంగా ఉండడమేనేమో. ఇక ప్రతినాయకుడిగా సుదీప్ ఫరవాలేదు.

ప్రత్యేకతలు :

 1. మూలకథ మరియు ఊహలు (imaginations). చింబుదేవన్ వ్రాసిన మూలకథలో అతడి ఊహలు చాలా బాగున్నాయి. ఉదాహరణకు మాట్లాడే జంతువులు, బేతాళ జాతి గురించి అతడు చెప్పిన విషయాలు లాంటివి. కానీ తెరపై వాటిని సరిగ్గా ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు.
 2. విజువల్ ఎఫెక్ట్స్ (visual effects). ఇలాంటి జానపద కథలకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం. ఆ విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంది చిత్రబృందం.
 3. నటరాజ్ సుబ్రమణియం ఛాయాగ్రహణం. ఇది మరో బలం ఈ చిత్రానికి. లైటింగ్ తదితర విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
 4. ముత్తురాజ్ కళాదర్శకత్వం (art direction). మనోహరుడి భైరవకొన గూడెం, బేతాళుల కోట, “ఏంటి ఏంటి” గీతం ఇలా పలుచోట్ల కళాదర్శకత్వం ఆకట్టుకుంది.
 5. దేవీశ్రీప్రసాద్ సంగీతం. గీతాలు ఓ మోస్తరుగా ఉన్నా, నేపథ్య సంగీతంతో కథనం స్థాయిని పెంచే ప్రయత్నం బాగా చేశాడు దేవీ.

బలహీనతలు :

 1. కథనం. ఇలాంటి జానపద కథలను ఆద్యంతం అబ్బురపరిచేలా తెరకేక్కించాలి. ఆద్యంతం బోరుకొట్టే అతిశయపు కథనంతో వచ్చి ఈ విషయంలో చింబుదేవన్ పూర్తిగా విఫలమయ్యాడు.
 2. జుగుప్సాకరమైన హాస్యం. ఇందులోని “కోణంగి” పాత్ర చేసిన హాస్యం సహనాన్ని ఎంత పరీక్షించింది అంటే ఆ పాత్ర తెర దాటి బయటకు వస్తే బాగుండు అనిపించింది.
 3. అతిశయాలు. పలు అతిశయాలకు పెట్టింది పేరు ఈ పులి. గీతాల విడుదల వేడుకలో టీ.రాజేందర్ అన్నట్టుగా “ఇది అతిశయ పులి, ఇది ఆడంబర పులి”.
 4. నటనలు. ఈ రకమైన నటనలు తమిళ ప్రేక్షకులు ఆడరిస్తారేమో కానీ జాతీయ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నప్పుడు దగ్గరుండి అందరి మెప్పు పొందేలా నటింపచేసి ఉంటే చాలా బాగుండేది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

ఓ సినిమాలో బ్రహ్మానందం అన్న మాటను కాస్త మారిస్తే, “కథ చెప్పినప్పుడు నటులకు ఆస్కార్ చూపించి చిత్రం చూపిస్తున్నప్పుడు ప్రేక్షకుడికి నరకం చూపించకూడదు”.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

3 thoughts on “పులి (2015)

 1. Chetta cinema

  anukovadaniki story baagane undi, fantasy back drop with typical revenge story, brutal villain and saviour hero itla, hero villain ni edurkovadaniki munde chinna chinna addankulu type lo aa marugujju lokam etc ,inka aa maatlade pakshulu ilta just ideas unnai but annitni sarigga blend chese screenplay ghoramga fail ayyadu

  piccha comedy asalu okko story, aa love track ento, oorini kaapade vaadu ante chinnapatnundi aadini edo train chestaru anukunte assalu ala em choopinchaledu and intro lo ala kaallu pattukovadamenti, asalu edo plan unnattu dialouge but hero chesindi em undadu first half lo

  director dummy aite enta manchi tehnicians back up and vfx etc external factors unna em cheyaledu anedaniki example puli

  mundhe andaru cheppina talk vini and trailer choosina danni batti konchem rod experience taggindhi anthey 😀

  Like

 2. Pingback: Puli (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s