కుమారి 21F (2015)

సినిమాను చూసి సమాజం నేర్చుకునే కాలం ఒకప్పుడు ఉండేదేమో తెలియదు కానీ ఈ కాలంలో అది పచ్చి అబద్ధం. సినిమాను చూసి తాగుబోతులు, ఆకతాయిలు తయారవుతారు అనేది నమ్మబుద్ది కాని విషయం. నాకు సంబంధించినంత వరకు, సమాజమే సినిమాకు జన్మనిస్తుంది, విమర్శింపచేసుకుంటుంది. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సమకాలీన సమాజానికి అతీతంగా, హిపోక్రసి (hypocrisy) లేని ఓ పాత్ర ద్వారా సూటిగా విమర్శించడం “కె.బాలచందర్” గారి శైలి. అదే శైలిని అలవరచుకున్నారు దర్శకుడు “సుకుమార్”. ఆయన రచయితగా,…

Children of Heaven – ఓ అందమైన సమస్య

కళాభిమానానికి భాష, ప్రాంతం లాంటివి ఎప్పుడూ ఎల్లలు కావు. ఒకప్పుడు సినిమాలు చూడడం హాబీగా ఉన్న నాకు అది అలవాటుగా మారిన తరుణంలో, ఆ అలవాటు ఆంధ్ర దేశాన్ని దాటి, భారతదేశాన్ని దాటి అమెరికా వరకు చేరింది. ఇవే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాల్లోనూ సినిమాలు చూసే అలవాటు జనాలకు ఉందని తెలిసింది. అలా ఓ స్నేహితుడి సిఫార్సుతో చూసిన మొదటి “ఇరానీ” చిత్రం “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్”. “మజిద్ మజిడి” దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని…

19th ICFFI – Dummie De Mummie

భాగ్యనగరం వేదికగా ఈ ఏడాది జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పలు దేశాలకు సంబంధించిన చిత్రాలు ఈ నెల 14వ తేది నుండి పలుచోట్ల ప్రదర్శించబడుతున్నాయి. వాటిలో 15వ తేది ఉదయం 10 గంటలకు కూకట్పల్లిలోని శివపార్వతి ధియేటరులో నెథర్లాండ్ కు చెందిన “Dummie De Mummie” ప్రదర్శించబడినది. “టోస్కా మెంటన్” (Tosca Menten) అనే డచ్ రచయిత్రి రచించిన “Dummie De Mummie” అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి “టిస్ వాన్ మార్లే”…