జత కలిసే (2015)

కొన్ని సినిమాలు హడావుడి లేకుండా వచ్చేస్తాయి. వచ్చాక చాలా బాగుందంట అనే ప్రచారంతో వస్తాయి. అలాంటి సినిమాయే “జత కలిసే”. అశ్విన్ బాబు, తేజస్వి మడివాడ జంటగా నటించిన ఈ సినిమాతో “రాకేశ్ శశి” దర్శకుడిగా పరిచయమయ్యారు. వారాహి చలనచిత్రం, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కథ : ఓ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత రుషి (అశ్విన్), ఐ.ఏ.ఎస్ ఇంటర్వ్యూకి హాజరు కాబోయే తేజస్వి (తేజస్వి) ఒకే కారులో ప్రయాణం చేయాల్సివస్తుంది. కానీ అంతకముందే వారిరువురి…

భలే మంచి రోజు (2015)

సరైన కథ, కథనాలు లేని సినిమాలతో చిత్రపరిశ్రమ వాడిపోతోంది. ఇలాంటి సమయంలో దానికి కొత్త ఊపిరి పోయాల్సింది కొత్త దర్శకులే. ఈ మధ్య వచ్చిన కొత్త దర్శకులు తీసిన సినిమాల్లో “భలే మంచి రోజు” ఈ భావనను కలిగించింది. “శ్రీరామ్ ఆదిత్య” అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. సుధీర్ బాబు, వామిఖ గబ్బి జంటగా నటించగా, విజయ్, శశి నిర్మించారు. ఈ రోజు విషయాల్లోకి వెళ్తే… కథ : తనను కాదని పెళ్లి చేసుకోబోయే…

సౌఖ్యం (2015)

గోపీచంద్, రేజీనా జంటగా రూపొందిన సినిమా “సౌఖ్యం”. “ఏ.ఎస్.రవికుమార్ చౌదరి” దర్శకత్వం చేయగా, శ్రీధర్ సిఫాన, కోన వెంకట్, గోపీమోహన్ ర”చించ”గా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, భవ్య క్రియేషన్స్ పతాకంపై “ఆనంద్ ప్రసాద్” ఈ సినిమాని నిర్మించారు. కథ : కొడుక్కి పెళ్ళి సంబంధం చూడాలనే తన తండ్రి (ముకేష్ రుషి) కోరికకు ఎప్పుడూ అడ్డు చెప్తుంటాడు శ్రీనివాస్ (గోపీచంద్). దానికి కారణం అతడు మర్చిపోలేని శైలజ (రేజీనా). శ్రీనివాస్, శైలజ ఎలా పరిచయమయ్యారు, ఎలా దూరమయ్యారు,…