ఎక్స్‌ప్రెస్ రాజా (2016)

సినిమాకు పండగలు ఎంతో కీలకం. ముఖ్యంగా సంక్రాంతి పండుగ మన కథానాయకులకు ఆయువుపట్టు. ఇలాంటి పండుగలతో సంబంధం లేని కథానాయకులు కూడా ఉంటారు. ఉదాహరణకు శర్వానంద్ లాంటివారు. కానీ ఈసారి అగ్రనటుల సినిమాలతో పాటు శర్వానంద్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగింది. అదే “ఎక్స్‌ప్రెస్ రాజా”. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో పరిచయమైన “మేర్లపాక గాంధీ” ఈ సినిమాకు దర్శకుడు. సురభి కథానాయిక. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. కథ : నిరుద్యోగి అయిన…

డిక్టేటర్ (2016)

ప్రకృతిలో పర్వతాలు, నదులు, సముద్రాలు మారనట్టే చిత్రపరిశ్రమలో కొందరి సినిమాలు మారవు. వాటిలో ముందుండేవి నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు. వంద మైలురాయిని చేరుకునే ఆయన ప్రయాణంలో తన 99వ సినిమాగా వచ్చింది “డిక్టేటర్”. లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలతో మనకు పరిచయమైన “శ్రీవాస్” ఈ సినిమాకు దర్శకుడు. ఆయనే నిర్మాతగా మారి ఎరోస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలయింది. అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలు. కథ : చంద్రశేఖర్…

నాన్నకు ప్రేమతో (2016)

కథ, కథనం, స్టార్, పాటలు, ఫైట్లు ఇవన్నీ ప్రతి సినిమాకు కామన్. కానీ వీటిలో “సుకుమార్” సినిమాను ప్రత్యేకంగా నిలిపే అంశం “కథనం”. మామూలు కథను కూడా సరికొత్త కథనంతో, పాత్రలతో చెప్పగల సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్. వ్యాపారం, అభిమానం అనే చట్రాలలో ఇరుక్కుపోయిన కథానాయకుడు “ఎన్టీఆర్”. అతడిని దాన్నుండి పూర్తిగా బయటకు లాగి సుకుమార్ తీసిన సినిమా “నాన్నకు ప్రేమతో”. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా, జగపతిబాబు ప్రతినాయకుడిగా, భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా, దేవీశ్రీప్రసాద్ సంగీత…