Killing వీరప్పన్ (2016)

ఓ కథలో కథానాయకుడు, ప్రతినాయకుడు అని ఇద్దరు వ్యక్తులుంటారు. అందులో మొదటివాడు “మంచివాడు”, రెండోవాడు “చెడ్డవాడు” అయ్యుండాలి అనేది అనాదిగా వస్తున్న సినిమా సూత్రం. దాన్ని ఎప్పుడో బద్దలుకొట్టాడు “రామ్ గోపాల్ వర్మ”. అదే డాక్యుడ్రామా (docudrama) కథలను తీయడంలో వర్మని సిద్ధహస్తుడుని చేసింది కూడా. “రక్తచరిత్ర”, “26/11 ముంబై దాడులు” తరువాత అతడి తీసిన డాక్యుడ్రామా “Killing వీరప్పన్”. కన్నడలో తీసిన ఈ సినిమా అనువాదమై తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 7వ తేదిన విడుదలయింది.…

తమాషా (2015) – జీవితం అనే తమాషా కథకు ఓ తమాషా కథనం

ప్రతి కథకు ఇద్దరు వ్యక్తులు కావాలి. ఒకరు కథకుడు, మరొకడు ప్రేక్షకుడు. కథనాలు రెండు రకాలు. ఒకటి బాహ్య కథనం, మరొకటి ఆత్మాశ్రయ కథనం. వీటినే ఇంగ్లీషులో ఆబ్జెక్టివ్ నెరేషన్ మరియు సబ్జెక్టివ్ నెరేషన్ అంటారు. ఆబ్జెక్టివ్ నెరేషన్ లో కథకుడు కూడా ఓ ప్రేక్షకుడే. అతడి కళ్ళముందు జరిగిందే అతడు చెబుతాడు, అది ప్రేక్షకుడు వింటాడు. ఉదాహరణకు, టీవీలో విలేఖరి కథనం. సబ్జెక్టివ్ నెరేషన్ లో కథకుడు తన కథను ఓ పాత్ర కోణంలోంచి చెబుతాడు. లేదా ప్రేక్షకుడు కథనాన్ని ఓ…

నేను.. శైలజ… (2016)

“మనకు నచ్చిన సినిమాలు చేయడం కాదు, మనకు నప్పే సినిమాలు చేయాలి!” అనే మాట ఎక్కడో ఎవరో చెప్పినట్టు నాకు జ్ఞాపకం. “రామ్” విషయంలో ఈ వాక్యం అక్షరాల ఋజువైంది. “పండగ చేస్కో”, “శివమ్” లాంటి మూస సినిమాలతో విసిగించేసిన రామ్ ఈసారి ఓ చక్కని పసందైన ప్రేమకథతో వచ్చాడు. అదే, కీర్తి సురేష్ తో జంటగా నటించిన “నేను..శైలజ..”. 2015 ఆఖరులో వచ్చిన చెత్త సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కూడా 2016 మొదట్లో ఓ మంచి…