పెళ్ళిచూపులు (2016)

ఒక సినిమా ఓ ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చిందంటే, ఖచ్చితంగా ఆ సినిమా అతడి నిజజీవితానికి దగ్గరగా వచ్చిందని అర్థం. అలాంటి సినిమానే “పెళ్ళిచూపులు”. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన “తరుణ్ భాస్కర్” దర్శకత్వంలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”, “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలతో సుపరిచయమైన “విజయ్ దేవరకొండ”, “ప్రేమ ఇష్క్ కాదల్”, “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలతో సుపరిచయమైన “రీతు వర్మ” జంటగా నటించిన ఈ సినిమాను “రాజ్ కందుకూరి”, “యష్ రంగినేని” నిర్మించారు. “సురేష్ ప్రొడక్షన్స్” సంస్థ మరియు “మధుర…

కబాలి (2016)

  మందు కొట్టే అలవాటు లేనివారికి కూడా కిక్కెక్కించే మత్తు “రజినీకాంత్”. మందు పాతబడే కొద్ది దాని ఖరీదు పెరిగినట్టు, వయసు పైబడే కొద్ది రజిని సినిమాలకు అయ్యే ఖర్చు కూడా పెరుగుతోంది. అలాంటి ఓ సినిమానే “కబాలి”. కొందరు దర్శకులు కథను “కథ”గా చెప్పడంలో తడబడతారు కానీ దాన్ని తెరపై అద్భుతంగా ప్రదర్శించగలరు. కొందరేమో “కథ”గా చెప్పినప్పుడు అద్భుతంగా చెప్పగలరు కానీ దాన్ని తెరపై ప్రదర్శించడంలో తడబడతారు. ఈ సినిమా దర్శకుడు “రంజిత్”ని ఈ రెండో…

తాను – నేను

కవితకు రాగాన్ని జోడించి పాడడం బహుశా సులువేమో కానీ రాగానికి కవితను జోడింఛి పాడడం పెద్ద సాహసమని నా అభిప్రాయం. “సాహసం శ్వాసగా సాగిపో” సినిమా కోసం రచయిత “అనంతశ్రీరాం” అదే సాహసం చేశారు, “తాను నేను” అనే పాటతో. వినడానికి సొంపుగా ఉండే “రెహమాన్” సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట ఇప్పటికే అందరికి బాగా నచ్చేసింది. ఒంటరిగా ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు పాడుకోవడానికి సులభంగా ఉండే పాటను వ్రాయడం నిజంగా చాలా కష్టమనిపించింది. ఆ…