మగ’మెగా’రాజు
సినిమా అనేది మన జీవితాల్లో భాగమైపోయినప్పుడు సినీనటులు కూడా మన కుటుంబసభ్యులు అయిపోతారు. అలా మన కుటుంబాల్లో ఓ విశిష్టమైన స్థానం సంపాదించుకున్న నటుడు “మెగాస్టార్ చిరంజీవి”. ఈయన గురించి ఇంతకంటే ఉపోద్ఘాతము అవసరంలేదు. ఆయన పుట్టినరోజున ఈ ఆర్టికల్ వ్రాస్తున్న నన్ను చిరంజీవి అభిమాని అనుకుంటారేమో మీరు. కానే కాదు. చిరంజీవి నాకు ఒక పదేళ్ళ క్రితం పరిచయం అయ్యుంటే బహుశా “అభిమాని” అనే పిలుపుకి నేను పలికేవాడినేమో. కానీ ఊహ తెలిసినప్పటి నుండి విన్న పేర్లలో…