జ్యో అచ్యుతానంద (2016)

ఒక సినిమా కథ వ్రాయడానికి ఏవేవో చదివేసి ఎక్కడో దూరంగా సన్యాసిలా బ్రతకాల్సిన అవసరంలేదు. తొంగిచూస్తే, ప్రతి మనిషి జీవితంలో బోలెడు కథలుంటాయి. వాటికి సరైన నాటకీయతను జోడించగలిగితే అవే సినిమా కథలవుతాయి. ఈ నిజాన్ని నమ్ముకున్న ఏ దర్శకుడూ పరాజయం పొందలేదు. అలాంటివారిలో “అవసరాల శ్రీనివాస్” ఒకడు. “ఊహలు గుసగుసలాడే”తో మెప్పించిన ఈయన ఈసారి “జ్యో అచ్యుతానంద” సినిమాతో మన ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీన నటించిన ఈ సినిమాను “వారాహి చలన చిత్రం”…

గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన – సప్తపది

కాలంతోపాటు సినిమా పాట వ్రాసే విధానం, వినబడే విధానం మారిపోయాయి. అంతేకాదు ప్రేక్షకులకు ఓపిక కూడా తగ్గిపోయింది. ఇప్పటి మా తరమంతా సినిమా పాటంటే పని ఒత్తిడి నుండి విశ్రాంతి కలిగించే సంగీతం ఉండాలి, సులువుగా పాడుకునేలా సాహిత్యం ఉండాలని చూస్తున్నాం. అసలే రకరకాల ఒత్తిళ్ళు మనసుపై ఉన్నప్పుడు, ఫలానా సినిమా పాటను అర్థం చేసుకోవడానికి మనసుకు మళ్ళీ ఒత్తిడిని కలిగించడానికి దాదాపుగా ఎవరూ ఇష్టపడట్లేదు. అందుకే, రచయితలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సులభమైన పదాలతో…

జనతా గ్యారేజ్ (2016)

ఓ మంచిమాట ఓ మామూలు హీరో చెబితే అది మామూలు మాటే అవుతుంది. అదే మంచిమాట ఓ స్టార్ చెబితే అది మరింత మంచిమాట అవుతుంది. అదే చేయిస్తాడు “కొరటాల శివ” తన సినిమాల్లో. ఓ మంచిమాటను ఎన్టీఆర్ ద్వారా చెబుతూ “జనతా గ్యారేజ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కంప్లీట్ యాక్టర్ “మోహన్‌లాల్” మరో ముఖ్యపాత్రను పోషించిన ఈ సినిమాలో సమంత, నిత్యమేనన్ కథానాయికలు. “మైత్రి మూవీ మేకర్స్” పతాకంపై నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మించారు.…