వంగవీటి (2016)
“భావోద్వేగాలను రెచ్చగొడితే మిగిలేది చరిత్రే“. మహాభారతం కాలం నుండి అనేక కథల్లో ఉన్న నీతి ఇది. అన్నీ తెలిసి కూడా ఆగలేని భావోద్వేగం కట్టలు తెంచుకొని విరుచుకుపడిన ప్రతిసారీ ఒక కథ చరిత్ర పుటల్లోకి ఎక్కుతూనే ఉంటుంది. అలాంటి కొన్ని పుటలు “రాంగోపాల్ వర్మ” చేతికి దొరుకుతూనే ఉంటాయి. వాటిని అతడు సినిమాలుగా తీస్తూనేవుంటాడు. అలాంటి ఒక పుటే “వంగవీటి“. ఈ సినిమాను “దాసరి కిరణ్ కుమార్” నిర్మించగా సందీప్ కుమార్, వంశీ చాగంటి, కౌటిల్య, నైన…