ఘాజీ (2017)
ఆద్యంతం ఒకే అంశంపై సాగే సినిమాలు హాలీవుడ్ లో అతి సహజం. భారతదేశంలో అరుదు. ఒకవేళ తీయలనుకుంటే వ్యాపార లెక్కలు, ప్రేక్షకుల అభిరుచి, వీటిని బట్టి సినిమాకు ఎదురయ్యే ఆర్ధిక ఇబ్బందులు, ఇలా ఎన్నో అంశాలను మనసులో ఉంచుకోవాలి. మంచి విషయమేమిటంటే, ప్రేక్షకుల అభిరుచి మారిపోతోంది. మూస సినిమాలకన్నా కొత్తరకం సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా నటులు, నిర్మాతలు కూడా మారుతున్నారు. కొత్త దర్శకులను, సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి మంచి తరుణంలో వచ్చిన సినిమా…