పూలనే కునుకేయమంటా – ఐ

తమిళ సినిమాలు తెలుగులో అనువాదం చేసే క్రమంలో పాటల అనువాదం తాలూకు బాధ్యతను ఒకప్పుడు “రాజశ్రీ” అనే రచయిత తన భుజాలపై వేసుకొని చక్కగా నిర్వర్తించేవారు. తరువాత “వేటూరి”, “ఏ.ఎం.రత్నం – శివగణేష్”, “భువనచంద్ర”, “వెన్నెలకంటి రాజేశ్వరరావు”,  అడపాదడపా “సీతారామశాస్త్రి” లాంటివారు తీసుకున్నారు. రత్నం ద్వయాన్ని ప్రక్కనబెడితే, మిగతా రచయితలు కొన్నిసార్లు తమ రచనలతో మెప్పించినా, మరికొన్నిసార్లు అర్థాన్ని విడిచి శబ్దానికి బానిసైన తమ పదజాలంతో, శ్రోతకు తాను అద్దెకు తెచ్చుకున్న పాట వింటున్న భావనకలిగించారు. క్రమేణా,…

ఫిదా (2017)

సినిమా హిట్టా కాదా అన్న విషయం పక్కనబెడితే ఆ సినిమా ద్వారా దర్శకుడు తను చెప్పాలనుకున్న అంశాలను కూలంకషంగా చెప్పాడా లేదా అన్నది చాలా ముఖ్యం. అలాంటి క్లారిటీ ఉన్న దర్శకుల్లో “శేఖర్ కమ్ముల” ముందువరుసలో ఉంటారు. సినిమాకు సామాజిక బాధ్యత ఉందని నమ్మి అదే బాధ్యతతో సినిమాలు తీసే దర్శకుల్లో కూడా శేఖర్ ఒకడు. సుదీర్ఘమైన విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఫిదా“. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ…

శమంతకమణి (2017)

ఒక సినిమాలో ఎంతమంది హీరోలున్నా వాళ్ళందరినీ మించిన హీరో ఒకటి ఉంటుంది. అదే కథ. ఇటీవల కథే హీరోగా వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఒకటి “శమంతకమణి“. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది మరియు రాజేంద్రప్రసాద్ ప్రాధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు “భలే మంచి రోజు”తో పరిచయమైన “శ్రీరామ్ ఆదిత్య” దర్శకత్వం వహించారు. “భవ్య క్రియేషన్స్” పతాకంపై “ఆనంద్ ప్రసాద్” నిర్మించారు. కథ : శమంతకమణి పేరు గల అయిదు కోట్ల…