పెళ్ళినాటి ప్రమాణాలు (1958) – ఆహ్వానం (1997)
ఓసారి వచ్చిన ఓ సినిమా కథతో మళ్ళీ ఇంకో సినిమా తీయడం సర్వసాధారణం. కానీ మాతృక కంటే రీమేక్ సినిమానే బాగున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అందులో చెప్పుకోదగినది “పెళ్ళినాటి ప్రమాణాలు” (మాతృక), “ఆహ్వానం” (రీమేక్). ఈ ఆర్టికల్ లో ఈ రెండు సినిమాల గురించి విశదీకరించి చెప్పదలిచాను. పెళ్ళినాటి ప్రమాణాలు: 1958వ సంవత్సరంలో “కె.వి.రెడ్డి” స్వీయనిర్మాణంలో తీసిన సినిమా ఇది. అక్కినేని నాగేశ్వరరావు, జమున, రాజసులోచన ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్డిగారి ఆస్థాన రచయిత “పింగళి…