గెలుపు లేని సమరం

  సినిమా సాహిత్యం చాలా గొప్పది. ఓ రచయిత స్వతహాగా వ్రాసుకునే కవితలకు, నవలలకు ఎలాంటి ఎల్లలుండవు. తన ఊహలు ఎంత దూరం వెళతాయో అంత దూరం తన కలాన్ని ప్రయాణం చేయించగలడు. కానీ సినిమా సాహిత్యం రచయితను ఓ నిర్ణీత ప్రహరీలో బంధించేస్తుంది. ఆ బంధనంలో కూడా స్వేచ్చగా ఎగరగలగడంలోనే ఉంది రచయిత గొప్పతనం. అలాంటి గొప్ప సినిమా సాహిత్యానికి ఎన్నో మచ్చుతునకలు. అందులో ఒకటి “మహానటి” సినిమాలోని “గెలుపు లేని సమరం” అనే పాట.…

అరవింద సమేత వీరరాఘవ (2018)

రామాయణాన్ని మొదట వాల్మీకి రచించారు. ఆ తరువాత మొల్ల, గోన బుద్దారెడ్డి లాంటి కవులు కూడా రచించారు. అలాగే మహాభారతాన్ని మొదట వేదవ్యాసుడు రచించారు. ఆ తరువాత తెలుగు కవిత్రయం రచించారు. ఒకే కథను పలు రచయితలు మళ్ళీ మళ్ళీ రచించినా ప్రేక్షకులు చదివారు. దానికి కారణం, ఒకే కథను వేర్వేరు రచయితలు చెప్పిన కోణాలు. “అరవింద సమేత వీరరాఘవ” సినిమా కూడా అంతే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మళ్ళీ అదే నేపథ్యంతో…