దళపతి (1991) – ఆ మూడు ఘట్టాలు
ఈ సినిమా పేరు తలచుకోగానే గుర్తొచ్చేది మూడు అతి ముఖ్యమైన ఘట్టాలు. అవి కథనంలో క్రమంలోనే వస్తాయి. మొదటి ఘట్టం – సూర్య, పద్మల వివాహం నాకు అమితంగా నచ్చిన సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో ఉండడానికి కారణం ఈ ఘట్టం. మణిరత్నం ఎంత గొప్ప రచయితో ఓ దృష్టాంతం చూపింది కూడా ఈ ఘట్టమే. పురిటిలోనే తల్లికి దూరమైన కొడుకుగా, శాపగ్రస్తుడైన మహావీరుడుగా, మోసం చేత అర్థాంతరంగా చనిపోయిన రాజుగా మిక్కిలి సానుభూతి కలిగించేలా మహాభారతంలో…