NTR మహానాయకుడు (2019)
మొదటగా మంచి విషయాలకు వస్తే… ఖచ్చితంగా మొదటి పార్టు “ఎన్టీఆర్ కథానాయకుడు” కంటే బెటర్ గా అనిపించింది. మొదటి దాంట్లో అసలు కథ కన్నా తండ్రి వేసిన పాత్రలన్నీ నేను మళ్ళీ వేయాలన్న బాలకృష్ణ తాపత్రయమే ప్రధానంగా కనిపించింది. అందుకే, అందులో బాలకృష్ణ తప్ప ఎన్టీఆర్ కనిపించలేదు. కానీ ఇందులో ఎన్టీఆర్ కనిపించాడు. ఆయనతో పాటు అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా కనిపించాయి. అసలు ఎన్టీఆర్ తన ఆధిక్యతని ఎలా నిరూపించుకుంటాడు అన్న క్రమంలో వచ్చే సన్నివేశాలు…