కరోనా లాక్‌డౌన్‌లో నేను చూసిన సినిమాలు -1

కరోనా కారణంగా అమలు చేసిన లాక్ డౌన్ సమయంలో మొదటి విడతగా నేను చూసిన సినిమాలు, వాటి గురించి క్లుప్తంగా నా కామెంట్లు. ఇందులో ఎటువంటి క్రమం లేదు. Badla (Hindi) – Netflix ఇది చూడక చాలా రోజుల ముందే దీని మాతృక స్పానిష్ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘ఎవరు’ చూశాను. ఇది చూసినప్పుడు మూలకథ తెలిసినప్పటికీ కథనం వేరుగా అనిపించింది. అస్సలు బోరు కొట్టలేదు. అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను. అయితే, నేను స్పానిష్…