విద్యాసాగర్ – మళయాళ సినిమాను ఏలిన తెలుగు సంగీతకారుడు

ఈ రోజు సంగీత దర్శకుడు “విద్యాసాగర్” పుట్టినరోజు. ఈయన సంగీతం చాలా ప్రత్యేకంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలుగులో దిగ్దర్శకులతో పని చేసినా దురదృష్టవశాత్తూ ఆ సినిమాలు ఆదరణ పొందకపోవడంతో జనాలకు ఎక్కువగా గుర్తులేరు. కానీ మళయాళంలో జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా నాకు నచ్చిన కొన్ని పాటలు… తెలుగు ప్రేక్షకులకు గుర్తుచేయాలన్న ఉద్దేశంతో ఎక్కువగా తెలుగు పాటలే పంచుకుంటాను. అడపాదడపా పరభాషా పాటలు. ఇందులో ఎటువంటి క్రమమూ లేదు ఇది నాదని అది నీదని – స్వరాభిషేకం…

సినీ ధనాభిరామం – 1

‘రోజుకో తెలుగు పద్యం’ కార్యక్రమంలో భాగంగా ‘జీడిగుంట విజయసారథి’ గారు పరిచయం చేసిన ‘నూతనకవి సూరన’ గారు వ్రాసిన ‘ధనాభిరామం’ స్ఫూర్తిగా తీసుకొని చేసిన సంకలనం ఈ ‘సినీ ధనాభిరామం’. ముందుగా, సూరన ధనాభిరామం యొక్క సారాంశం ఏమిటో క్లుప్తంగా చూద్దాం. ఓ రోజు ఇంద్ర సభలో కుబేరుడికి, మన్మథుడికి మధ్య ఓ వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. ధనం గొప్పదని, దానితో ఏదైనా సాధ్యమని కుబేరుడి వాదన. ధనం పాపిష్టిదని, అది పక్కన చేరితే మనిషికి ఎన్నో…

కరోనా లాక్‌డౌన్‌లో నేను చూసిన సినిమాలు -2

కరోనా కారణంగా అమలు చేసిన లాక్ డౌన్ సమయంలో రెండో విడతగా నేను చూసిన సినిమాలు, వాటి గురించి క్లుప్తంగా నా కామెంట్లు. ఇందులో ఎటువంటి క్రమం లేదు. Palasa 1978 (Telugu) – Prime Video ఈ సినిమాకు ‘రంగస్థలం’తో దగ్గర పోలికలు ఉన్నాయి. రెండూ 70, 80లలో జాతి పేరిట చూపిన వివక్షతనే ప్రధాన అంశంగా కలిగిన సినిమాలు. అయితే, రంగస్థలం ప్రత్యేకంగా ఫలానా వర్గమని చెప్పకుండా అంతర్లీనంగా నడిస్తే, పలాస ప్రత్యేకించి కులాల…