సినీ ధనాభిరామం – 1
‘రోజుకో తెలుగు పద్యం’ కార్యక్రమంలో భాగంగా ‘జీడిగుంట విజయసారథి’ గారు పరిచయం చేసిన ‘నూతనకవి సూరన’ గారు వ్రాసిన ‘ధనాభిరామం’ స్ఫూర్తిగా తీసుకొని చేసిన సంకలనం ఈ ‘సినీ ధనాభిరామం’. ముందుగా, సూరన ధనాభిరామం యొక్క సారాంశం ఏమిటో క్లుప్తంగా చూద్దాం. ఓ రోజు ఇంద్ర సభలో కుబేరుడికి, మన్మథుడికి మధ్య ఓ వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. ధనం గొప్పదని, దానితో ఏదైనా సాధ్యమని కుబేరుడి వాదన. ధనం పాపిష్టిదని, అది పక్కన చేరితే మనిషికి ఎన్నో…