మామ పాటకు ఎన్నెన్ని హొయలో…
భావ, రాగ భాష్యమే పాట. ఈ రెండింటిలో ఏ ఒక్కటి మరో దాని పై ఆధిక్యత చూపించినా పాట రక్తి కట్టదు. సంగీతం గొప్పదా లేక సాహిత్యం గొప్పదా అనే వివాదం ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆ రెండు సరస్వతి దేవికి రెండు కళ్ళు అనేది మాత్రం సత్యం. సినిమా పాటకు పై రెండు లక్షణాలు చాలా అవసరం. ఆ రెండింటినీ సమపాళ్ళలో మేళవించి పాటలు చేసిన సినీ సంగీత దర్శకులలో శ్రీ ‘కె. వి. మహదేవన్’…