దళపతి (1991) – ఆ మూడు ఘట్టాలు

ఈ సినిమా పేరు తలచుకోగానే గుర్తొచ్చేది మూడు అతి ముఖ్యమైన ఘట్టాలు. అవి కథనంలో క్రమంలోనే వస్తాయి. మొదటి ఘట్టం – సూర్య, పద్మల వివాహం నాకు అమితంగా నచ్చిన సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో ఉండడానికి కారణం ఈ ఘట్టం. మణిరత్నం ఎంత గొప్ప రచయితో ఓ దృష్టాంతం చూపింది కూడా ఈ ఘట్టమే. పురిటిలోనే తల్లికి దూరమైన కొడుకుగా, శాపగ్రస్తుడైన మహావీరుడుగా, మోసం చేత అర్థాంతరంగా చనిపోయిన రాజుగా మిక్కిలి సానుభూతి కలిగించేలా మహాభారతంలో…

మహానటి (2018)

కనిపించే ప్రతి నవ్వు వెనుక సంతోషమే ఉండాలని లేదు. కనిపించే ప్రతి కన్నీటి వెనుక బాధ ఉండాలని కూడా లేదు. సినిమా నటుల విషయంలో ఇది వందశాతం నిజం. తెర మీద వాళ్ళు పంచే ఆనందమే ప్రేక్షకుడికి కనిపిస్తుంది కానీ అక్కడి వరకు రావడానికి వాళ్ళు తెర వెనుక వదిలేసిన విషాదం ఎవరికీ కనబడదు. ఆ విషాదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తారలు కూడా భూమి మీద పుట్టినవారే అన్న సంగతి అవగతం అవుతుంది. అసలు ఎప్పుడో…

గౌతమిపుత్ర శాతకర్ణి (2017)

గీతను భగవంతుడు భోదించాడు కనుకే అది “భగవద్గీత” అయ్యింది. అదే మనిషి చెప్పుంటే అది ఓ మామూలు గీతగా మిగిలిపోయి ఉండేది. అంటే, మంచి విషయాన్ని బలహీనుడు చెబితే అది మామూలు విషయం అవుతుంది. అదే ఓ బలవంతుడు చెబితే శాసనం అవుతుంది. దర్శకుడు “క్రిష్” కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తాడు తన సినిమాల్లో. కేవలం మంచి కథలుంటే ఉంటే సరిపోదు. ఆ మంచి అందరికీ చేరాలి అంటే అంత బలమున్న వ్యక్తి చేత దాన్ని చెప్పించాలి.…