పూలనే కునుకేయమంటా – ఐ
తమిళ సినిమాలు తెలుగులో అనువాదం చేసే క్రమంలో పాటల అనువాదం తాలూకు బాధ్యతను ఒకప్పుడు “రాజశ్రీ” అనే రచయిత తన భుజాలపై వేసుకొని చక్కగా నిర్వర్తించేవారు. తరువాత “వేటూరి”, “ఏ.ఎం.రత్నం – శివగణేష్”, “భువనచంద్ర”, “వెన్నెలకంటి రాజేశ్వరరావు”, అడపాదడపా “సీతారామశాస్త్రి” లాంటివారు తీసుకున్నారు. రత్నం ద్వయాన్ని ప్రక్కనబెడితే, మిగతా రచయితలు కొన్నిసార్లు తమ రచనలతో మెప్పించినా, మరికొన్నిసార్లు అర్థాన్ని విడిచి శబ్దానికి బానిసైన తమ పదజాలంతో, శ్రోతకు తాను అద్దెకు తెచ్చుకున్న పాట వింటున్న భావనకలిగించారు. క్రమేణా,…