ఆచార్య ఆత్రేయ

తెలుగు సినీపాట చరిత్రలో ఆత్రేయకు ప్రత్యేకమైన స్థానముంది. అది ఆయనకున్న ప్రత్యేకమైన రచనా శైలివల్లే వచ్చిందని చెప్పాలి. నేను గమనించినంత వరకూ ఆత్రేయ క్లిష్టమైన పదాలు వాడడు. సహజంగా మాట్లాడుకునే భాషలోనే ఉంటాయి ఆయన పాటలు. అయితే వాటి భావం మాత్రం మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోతుంది. “మూగమనసులు” సినిమాకు ఆయన వ్రాసిన పాటలు అత్యుత్తమంగా అనిపిస్తాయి… పూలదండలో దారం దాగుందని తెలుసును పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ…

లక్ష్మీ’s NTR (2019)

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ “నందమూరి తారకరామారావు” జీవితం మహాభారతం స్థాయికి ఏమాత్రం తీసిపోనిది. దానిలాగే ఎన్నో ఘట్టాలు కలిగిన జీవితం ఆయనది. అందులో ఓ ముఖ్యమైన ఘట్టం “లక్ష్మీపార్వతితో వివాహం”. ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతి వైవాహిక జీవితం అప్పటి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాయన్నది ఈ సినిమా కథాంశం. బయోపిక్కులలో తనదైన మార్కు వేసిన రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజుతో కలిసి తీసిన ఈ సినిమా 1989 ప్రాంతంలో మొదలవుతుంది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన కొన్ని…

NTR మహానాయకుడు (2019)

మొదటగా మంచి విషయాలకు వస్తే… ఖచ్చితంగా మొదటి పార్టు “ఎన్టీఆర్ కథానాయకుడు” కంటే బెటర్ గా అనిపించింది. మొదటి దాంట్లో అసలు కథ కన్నా తండ్రి వేసిన పాత్రలన్నీ నేను మళ్ళీ వేయాలన్న బాలకృష్ణ తాపత్రయమే ప్రధానంగా కనిపించింది. అందుకే, అందులో బాలకృష్ణ తప్ప ఎన్టీఆర్ కనిపించలేదు. కానీ ఇందులో ఎన్టీఆర్ కనిపించాడు. ఆయనతో పాటు అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా కనిపించాయి. అసలు ఎన్టీఆర్ తన ఆధిక్యతని ఎలా నిరూపించుకుంటాడు అన్న క్రమంలో వచ్చే సన్నివేశాలు…