హలో! (2017)

సినిమా ప్రకటించినప్పటి నుండే ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడోనని ఆసక్తిని రేకెత్తించే దర్శకుల జాబితాలో “మనం”తో చేరిపోయాడు “విక్రమ్ కుమార్“. “24”లాంటి క్లిష్టమైన కథను కూడా అతి సులువుగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పిన విక్రమ్ ఈసారి “హలో!” అంటూ అఖిల్, కళ్యాణి ప్రియదర్శిని జంటగా సినిమాను రూపోదించాడు. “అన్నపూర్ణ స్టూడియోస్” మరియు “మనం ఎంటర్ప్రైసెస్” నిర్మించిన ఈ సినిమాకు “అక్కినేని నాగార్జున” నిర్మాత. కథ : విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి) కోసం కొన్ని…

నిర్మలా కాన్వెంట్ (2016)

తెలుగు సినిమాకు ప్రేమకథ అనాదిగా నమ్ముకున్న సూత్రం “కోటలో రాణి తోటలో రాముడు“. కానీ మారుతున్న ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా సినిమా కూడా మారాలి కనుక అదే సూత్రానికి కొత్త పూతలు పూసి తీసే ప్రయత్నాలు చేస్తుంటారు దర్శకులు. అలాంటి ఓ ప్రయత్నమే “నిర్మలా కాన్వెంట్”. హీరో శ్రీకాంత్ కొడుకు “రోషన్” తొలిపరిచయంగా, అతడికి జంటగా “శ్రేయా శర్మ” నటించిన ఈ సినిమాతో “నాగ కోటేశ్వరరావు” దర్శకుడిగా పరిచయమయ్యారు. “అక్కినేని నాగార్జున” నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో…

సోగ్గాడే చిన్నినాయనా (2016)

కొందరు కేవలం కథను నమ్ముకొని సినిమా చేస్తారు. మరికొందరు కేవలం వ్యాపారాన్ని నమ్ముకొని సినిమా చేస్తారు. కానీ కథతో పాటు వ్యాపారాన్ని కూడా పక్కాగా చూసుకొని చేసే కథానాయకుడు అక్కినేని నాగార్జున. దీనికి ఆయన గతంలో చేసిన పలు సినిమాలే సాక్ష్యాలు. అలాగే కొత్త దర్శకులను పరిచయం చేయడంలోనూ ముందుండే ఏకైక “హీరో” నాగార్జున అని చెప్పొచ్చు. ఈసారి “కళ్యాణ్ కృష్ణ” అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ, తనే నిర్మాతగా నిర్మించిన సినిమా “సోగ్గాడే చిన్నినాయనా”.…