అసుర (2015)
వారసత్వం కథానాయకుడిని పరిచయం మాత్రమే చేస్తుంది. కానీ సినిమాపై అతడి ఆసక్తి పరిశ్రమలో అతడిని నిలబెడుతుంది. అలా మెల్లగా పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న కథానాయకుడు “నారా రోహిత్”. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ, మామూలు పంథాకు భిన్నంగా కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వారసుడు ఇతడు. ఈసారి నిర్మాతగానూ మారి, “కృష్ణ విజయ్” అనే దర్శకుడిని పరిచయం చేస్తూ “అసుర” చిత్రంతో తెరపైకి వచ్చాడు. కథ : ధర్మాన్ని గెలిపించడానికి అవసరమైతే నియమాలను కూడా అధిగమించగల…