ఆచార్య ఆత్రేయ
తెలుగు సినీపాట చరిత్రలో ఆత్రేయకు ప్రత్యేకమైన స్థానముంది. అది ఆయనకున్న ప్రత్యేకమైన రచనా శైలివల్లే వచ్చిందని చెప్పాలి. నేను గమనించినంత వరకూ ఆత్రేయ క్లిష్టమైన పదాలు వాడడు. సహజంగా మాట్లాడుకునే భాషలోనే ఉంటాయి ఆయన పాటలు. అయితే వాటి భావం మాత్రం మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోతుంది. “మూగమనసులు” సినిమాకు ఆయన వ్రాసిన పాటలు అత్యుత్తమంగా అనిపిస్తాయి… పూలదండలో దారం దాగుందని తెలుసును పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ…