భలే భలే మగాడివోయ్ (2015)

మాములుగా చిత్రసీమలో తప్పటడుగు వేస్తే, దాన్ని వెనక్కు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ దర్శకుడు “మారుతి” విషయంలో అది తప్పని ఋజువయ్యింది. “ఈరోజుల్లో”, “బస్టాప్” లాంటి కథలను సరైన కథనాలతో చెప్పక, చెడ్డపేరు సంపాదించుకున్న మారుతి ఈసారి “భలే భలే మగాడివోయ్” అనే చిత్రంతో తనపై ఉన్న నిందలను తొలగించుకునే ప్రయత్నం చేశాడు. నాని, లావణ్య త్రిపాఠి జంటగా గీతా ఆర్ట్స్ 2 పతాకంపై “బన్నీ వాస్” నిర్మించిన ఈ చిత్రపు విశేషాల్లోకి వెళ్తే… కథ…