బిచ్చగాడు (2016)

నేను సినిమా రివ్యూలు వ్రాయడం మొదలుపెట్టాక, విడుదలయిన 50 రోజుల తరువాత చూసిన ఏకైక సినిమా “బిచ్చగాడు”. కేవలం సమయం కుదరకే దీన్ని చూడడం జరగలేదు. ఒక డబ్బింగ్ సినిమా, ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేని ఓ హీరో “విజయ్ ఆంటోనీ” సినిమా, ఎన్నో ఏళ్ళ క్రితం వెంకటేష్ తో “శీను” అనే సినిమాను తీసిన “శశి” అనేవాడు దర్శకత్వం వహించిన సినిమా, ఇలా ఈ సినిమాను ఒక మామూలు తెలుగు ప్రేక్షకుడు చూడడానికి ఆసక్తి చూపించని అంశాలివి.…