జై లవ కుశ (2017)

సినిమాకు కథే ప్రాణం కానీ ఆ కథకు ఊపిరి పోసి దాన్ని ప్రేక్షకుడి వరకు తీసుకొని వెళ్ళేది మాత్రం నటులే. అందుకే, ఒక్కోసారి అద్భుతమైన కథలు సరైన నటులు లేక మరుగునపడిన సందర్భాలు, ఓ మోస్తరు కథ కూడా నటుల వల్ల బ్రహ్మరథం పట్టించుకున్న దాఖలాలు సినీచరిత్రలో ఉన్నాయి. ఈ రెండో కోవకు చెందిన సినిమానే “జై లవ కుశ“. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమాకు “బాబీ” దర్శకుడు. “ఎన్టీఆర్ ఆర్ట్స్” పతాకంపై “కళ్యాణ్…

సర్దార్ గబ్బర్‌సింగ్ (2016)

ఏ సినిమాకైనా కథే ప్రాణం. ఒకవేళ కథ బలంగా లేకపోయినా, కథనం పటిష్టంగా ఉంటే చాలు, ఆ సినిమా బ్రతికేస్తుంది. కానీ కొన్ని సినిమాలకు ఈ విషయాలు కూడా అక్కర్లేదు. కేవలం కథానాయకుడు చాలు. అలాంటి కథానాయకుడే “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. ఆయన సినిమాలను కథ, కథనాలకన్నా అభిమానమే నడిపించేస్తుంది. ఆయనకున్న అభిమానాన్ని రెట్టింపు చేసిన సినిమా “గబ్బర్‌సింగ్”. ఇప్పుడు అదే పేరుని వాడుకుంటూ “సర్దార్ గబ్బర్‌సింగ్” అనే సినిమాతో మన ముందుకు వచ్చారు పవన్.…