చెలియా (2017)
నిత్యం ప్రేక్షకులను గమనించుకుంటూ, వాళ్ళ ఆలోచనల వేగంతో తమ ఆలోచనల వేగాన్ని సరితూచుకుంటూ వెళ్ళే దర్శకులు అధికంగా ఉన్న పరిశ్రమ మనది. అలా కాకుండా, తమకు నచ్చిన వేగంతో ప్రయాణిస్తూ తమకు వచ్చింది తమకు నచ్చినట్టుగా చెప్పుకుంటూ వెళ్ళే దర్శకులకు ప్రేక్షకుడే తమ దారిలో పరిచయమవుతాడు, ప్రభావితుడవుతాడు. అప్పటి నుండి, ఆ దర్శకుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రతిసారీ ఆ దర్శకుడితో ప్రయాణించడానికి తపించిపోతాడు. ఒక ప్రయాణం నిరాశపరిచినా కూడా మరో ప్రయాణం కోసం ఎదురుచూస్తాడు. అలాంటి…