ఖైదీ నంబర్ 150 (2017)

“ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని…” ఇది అక్షరాల “మెగాస్టార్ చిరంజీవి” అంటే. “ఖైదీ” సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయిపోయిన చిరంజీవి కొన్ని సంవత్సరాల తరువాత చేసిన సినిమా “ఖైదీ నంబర్ 150“. “వి.వి.వినాయక్” దర్శకుడిగా, “రాంచరణ్” నిర్మాతగా, కాజల్ కథానాయికగా “కొణిదెల ప్రొడక్షన్స్” పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో “విజయ్” కథానాయకుడిగా “మురుగదాస్” దర్శకత్వంలో తెరకెక్కిన “కత్తి” సినిమాకు రీమేక్. కథ : కలకత్తా జైలు నుండి…

మగ’మెగా’రాజు

సినిమా అనేది మన జీవితాల్లో భాగమైపోయినప్పుడు సినీనటులు కూడా మన కుటుంబసభ్యులు అయిపోతారు. అలా మన కుటుంబాల్లో ఓ విశిష్టమైన స్థానం సంపాదించుకున్న నటుడు “మెగాస్టార్ చిరంజీవి”. ఈయన గురించి ఇంతకంటే ఉపోద్ఘాతము అవసరంలేదు. ఆయన పుట్టినరోజున ఈ ఆర్టికల్ వ్రాస్తున్న నన్ను చిరంజీవి అభిమాని అనుకుంటారేమో మీరు. కానే కాదు. చిరంజీవి నాకు ఒక పదేళ్ళ క్రితం పరిచయం అయ్యుంటే బహుశా “అభిమాని” అనే పిలుపుకి నేను పలికేవాడినేమో. కానీ ఊహ తెలిసినప్పటి నుండి విన్న పేర్లలో…

బ్రూస్ లీ – The Fighter (2015)

ఓ పనిని సంకల్పిస్తే దాన్ని పూర్తిగా చేయాలి. సగంలో వదిలేస్తే మొదటికే మోసం. “శ్రీనువైట్ల” లాంటి దర్శకుడి నుండి “మార్పు” అందరూ కోరుకున్నారు. అతడు కూడా మారాలని సంకల్పించాడు. దాన్ని ఎంతవరకు సాధించాడన్నది “బ్రూస్ లీ – The Fighter” చిత్రం చెప్తుంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత. దాదాపు ఆరేళ్ళ విరామం తరువాత “మెగాస్టార్ చిరంజీవి” ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించారు.…