మహర్షి (2019)

సరైన సమయంలో సరైన కథను చెప్పడం కూడా ఆర్టే. అలా, సరైన టైంలో సరైన కథాంశంతో వచ్చిన సినిమా “మహర్షి”. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు “వంశీ పైడిపల్లి” దర్శకత్వం వహించాడు. “దిల్ రాజు”, “అశ్వనీదత్”, “పీవీపి” నిర్మించారు. కథ: డబ్బు సంపాదించడమే జీవితాశయంగా కలిగిన రిషి (మహేష్ బాబు) ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీకి సీ.ఈ.ఓగా ఎదుగుతాడు. సంవత్సరానికి 950 కోట్లు సంపాదించే రిషికి ఓ…

రాజా ది Great (2017)

కథలకు కొరత ఉందని చెప్పుకునే సినీపరిశ్రమలో ఇదివరకు చెప్పిన కథనే ప్రేక్షకుడికి మళ్ళీ చెప్పి అతడి మెప్పు పొందాలంటే, చెప్పే విధానం మార్చాలి. అందుకే, కొందరు దర్శకులు కథ మీద కన్నా కథనం మీద, పాత్రల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇదే పద్ధతిని పాటించిన సినిమా “రాజా ది Great”. “అనిల్ రావిపూడి” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, మెహ్రీన్ జంటగా నటించగా, “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” పతాకంపై “దిల్ రాజు”, “శిరీష్” నిర్మించారు.…

ఫిదా (2017)

సినిమా హిట్టా కాదా అన్న విషయం పక్కనబెడితే ఆ సినిమా ద్వారా దర్శకుడు తను చెప్పాలనుకున్న అంశాలను కూలంకషంగా చెప్పాడా లేదా అన్నది చాలా ముఖ్యం. అలాంటి క్లారిటీ ఉన్న దర్శకుల్లో “శేఖర్ కమ్ముల” ముందువరుసలో ఉంటారు. సినిమాకు సామాజిక బాధ్యత ఉందని నమ్మి అదే బాధ్యతతో సినిమాలు తీసే దర్శకుల్లో కూడా శేఖర్ ఒకడు. సుదీర్ఘమైన విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఫిదా“. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ…