జీవన వాహిని – గంగోత్రి

ఎన్నిసార్లు చెప్పినా, ఎవరెంత వాదించినా సినిమా సాహిత్యం చాలా కష్టమైనది, అంతే గొప్పది కూడా. స్వతంత్ర కవితకు ఎల్లలు లేవు. ఎల్లలు లేని సినీకవిత లేదు. మరో విధంగా చెప్పాలంటే, స్వతంత్ర సాహిత్యం ఆకాశంలో ఎగిరే పక్షి అయితే సినిమా సాహిత్యం పంజరంలో ఉండే పక్షి. పంజరపు ఎల్లలలో కూడా ఆ పక్షిని స్వేచ్ఛగా ఎగిరేలా చేయగల కవులున్నారు. వారిలో ప్రముఖుడు “వేటూరి సుందరరామ్మూర్తి”. ఆయన వ్రాసిన అలాంటి ఓ పాటే “గంగోత్రి” సినిమాలోని “జీవన వాహిని”.…