సాహసం శ్వాసగా సాగిపో (2016)

“అతడి సినిమా ఎప్పుడొస్తుంది?” అని ప్రేక్షకుడు ఎదురుచుసేలా చేసే దర్శకుల్లో “గౌతమ్ మేనన్” మొదటి వరసలోనే ఉంటారు. దీనికి కారణం జీవితాన్ని సినిమాగా చూపించాలనే ఆయన అభిరుచే. అదే “సూర్య సన్నాఫ్ కృష్ణన్”, “ఏ మాయ చేశావే” లాంటి సినిమాలను ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రవేసింది. “ఏ మాయ చేశావే” తరువాత నాగచైతన్య, గౌతమ్ మేనన్ కలిసి చేసిన సినిమా “సాహసం శ్వాసగా సాగిపో“. మంజిమ మోహన్ కథానాయికగా పరిచయమైన ఈ సినిమాను “ద్వారక క్రియేషన్స్” పతాకంపై “మిర్యాల…

తాను – నేను

కవితకు రాగాన్ని జోడించి పాడడం బహుశా సులువేమో కానీ రాగానికి కవితను జోడింఛి పాడడం పెద్ద సాహసమని నా అభిప్రాయం. “సాహసం శ్వాసగా సాగిపో” సినిమా కోసం రచయిత “అనంతశ్రీరాం” అదే సాహసం చేశారు, “తాను నేను” అనే పాటతో. వినడానికి సొంపుగా ఉండే “రెహమాన్” సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట ఇప్పటికే అందరికి బాగా నచ్చేసింది. ఒంటరిగా ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు పాడుకోవడానికి సులభంగా ఉండే పాటను వ్రాయడం నిజంగా చాలా కష్టమనిపించింది. ఆ…

కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)

సినిమాకు కథ ఎంత ముఖ్యమో, కథనం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా థ్రిల్లర్ చిత్రాలకు కథకన్నా కథనమే ముఖ్యం. ఈ ప్రాముఖ్యతలలో సమతుల్యం (balance) పాటించని చిత్రం “కొరియర్ బాయ్ కళ్యాణ్”. నితిన్, యామి గౌతమ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా “ప్రేమ సాయి” దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుప్రసిద్ధ దర్శకుడు “గౌతమ్ మీనన్” ఈ చిత్రానికి నిర్మాత. ఈ కొరియర్ విషయాల్లోకి వెళ్తే… కథ : తను ఇష్టపడ్డ కావ్య (యామి గౌతమ్) కోసం…