ఐ (2015)

సినీ పరిశ్రమలో ఏళ్ళ తరబడి ఒక దారిలో ప్రయాణం చేసిన కొందరు దర్శకులు అమాంతం దారిని మారిస్తే ఆ విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అదే జరిగింది దిగ్గజ దర్శకుడు “శంకర్” విషయంలో కూడా. తన మొదటి చిత్రం “జెంటిల్మెన్” నుండి “శివాజీ” వరకు సృజనాత్మకతతో పాటు సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తూ వచ్చాడు. తన “రోబో” చిత్రంలో సందేశం లేకపోయినప్పటికీ అందులోని అబ్బురపరిచే దృశ్యాలతో “సందేశం” గురించి ప్రేక్షకుడు మరిచిపోయేలా చేశాడు. అలాంటి శంకర్ తన “అపరిచితుడు”…