NTR కథానాయకుడు (2019)
ఈ సినిమా “డ్రామాటిక్ లిబర్టీ“ విపరీతంగా తీసుకొని తీయబడిన బయోపిక్కులా అనిపించింది. అది తప్పు కాదు, ఎందుకంటే డ్రామా లేని తెలుగు సినిమా కథ ఉప్పు, కారం లేని వంటకంలాంటిదని నా అభిప్రాయం. ఈ సినిమాలో ఎన్నో మంచి విషయాలున్నాయి. మొదటగా, ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్యనున్న స్నేహాన్ని చూపించిన విధానం, ఏయన్నారున్న సన్నివేశాల్లో ఆయనకు కూడా తగినంత గౌరవమిచ్చిన విధానం చాలా బాగున్నాయి. “సీతారామ కళ్యాణం” సినిమా కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ “ఔరా!” అనిపించింది. “గుండమ్మ…