మహానటి (2018)

కనిపించే ప్రతి నవ్వు వెనుక సంతోషమే ఉండాలని లేదు. కనిపించే ప్రతి కన్నీటి వెనుక బాధ ఉండాలని కూడా లేదు. సినిమా నటుల విషయంలో ఇది వందశాతం నిజం. తెర మీద వాళ్ళు పంచే ఆనందమే ప్రేక్షకుడికి కనిపిస్తుంది కానీ అక్కడి వరకు రావడానికి వాళ్ళు తెర వెనుక వదిలేసిన విషాదం ఎవరికీ కనబడదు. ఆ విషాదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తారలు కూడా భూమి మీద పుట్టినవారే అన్న సంగతి అవగతం అవుతుంది. అసలు ఎప్పుడో…

నేను.. శైలజ… (2016)

“మనకు నచ్చిన సినిమాలు చేయడం కాదు, మనకు నప్పే సినిమాలు చేయాలి!” అనే మాట ఎక్కడో ఎవరో చెప్పినట్టు నాకు జ్ఞాపకం. “రామ్” విషయంలో ఈ వాక్యం అక్షరాల ఋజువైంది. “పండగ చేస్కో”, “శివమ్” లాంటి మూస సినిమాలతో విసిగించేసిన రామ్ ఈసారి ఓ చక్కని పసందైన ప్రేమకథతో వచ్చాడు. అదే, కీర్తి సురేష్ తో జంటగా నటించిన “నేను..శైలజ..”. 2015 ఆఖరులో వచ్చిన చెత్త సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కూడా 2016 మొదట్లో ఓ మంచి…