జనతా గ్యారేజ్ (2016)

ఓ మంచిమాట ఓ మామూలు హీరో చెబితే అది మామూలు మాటే అవుతుంది. అదే మంచిమాట ఓ స్టార్ చెబితే అది మరింత మంచిమాట అవుతుంది. అదే చేయిస్తాడు “కొరటాల శివ” తన సినిమాల్లో. ఓ మంచిమాటను ఎన్టీఆర్ ద్వారా చెబుతూ “జనతా గ్యారేజ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కంప్లీట్ యాక్టర్ “మోహన్‌లాల్” మరో ముఖ్యపాత్రను పోషించిన ఈ సినిమాలో సమంత, నిత్యమేనన్ కథానాయికలు. “మైత్రి మూవీ మేకర్స్” పతాకంపై నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మించారు.…

శ్రీమంతుడు (2015)

సినిమాకు సామాజిక బాధ్యత ఉంది. సమాజానికి ఓ విషయాన్ని సినిమా చెప్పినంత బలంగా, సులువుగా మరే మాధ్యమం చెప్పలేదు. కానీ చివరికి సినిమా కూడా ఓ వ్యాపారమే. కనుక విషయాన్ని వ్యాపార సూత్రాలతో కలిపి చెప్తే అన్ని విధాలా లాభమని ఓ నమ్మకం. అలాంటి ప్రయత్నమే “శ్రీమంతుడు” చిత్రం. మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి “కొరటాల శివ” దర్శకుడు. మైత్రి మూవీస్ పతాకంపై నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మించారు. దీని ద్వారా మహేష్ బాబు…