కృష్ణం వందే జగద్గురుమ్
పరిచయం: తెలుగు సినిమా ఆరంభం నుండి వచ్చిన అత్యుత్తమ పాటల్లో కృష్ణం వందే జగద్గురుమ్ పాట ఒకటని అనడంలో అతిశయోక్తి లేదు. “ఈ పాట వ్రాయడానికే నేను ఇన్నేళ్ళుగా చిత్రపరిశ్రమలో ఉన్నానేమో” అని రచయిత సీతారామశాస్త్రి గారు అన్నారంటే ఆ పాట ఆయన ప్రస్థానంలో ఆయనకెంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. కేవలం, ఆయన ప్రస్థానంలో మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రస్థానంలో కూడా ఈ పాట అంతే విలువైనది. శాస్త్రి గారు వ్రాసిన అన్ని పాటలు ఒక…