కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015)
“రీమేక్” చిత్రాలు మన చిత్రసీమకు కొత్తేమీ కాదు. అలాంటి చిత్రాలు తీయడం తప్పు కూడా కాదు. కానీ ఓ భాషలోని చిత్రాన్ని మరో భాషలో తీయాలనుకున్నప్పుడు దాన్ని ఆ ప్రేక్షకులు మెచ్చే విధంగా అందులో మార్పులు చేయడం చాలా అవసరం. కన్నడ భాష నుండి మనం అరువుతెచ్చుకున్న చిత్రాలు తక్కువే. అలాంటి వాటిలో ఒకటి “కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ”. కన్నడలో విజయవంతమైన “చార్మినార్” చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చార్మినార్ దర్శకుడైన “ఆర్.చంద్రు” దర్శకత్వం వహించారు.…