సోగ్గాడే చిన్నినాయనా (2016)

కొందరు కేవలం కథను నమ్ముకొని సినిమా చేస్తారు. మరికొందరు కేవలం వ్యాపారాన్ని నమ్ముకొని సినిమా చేస్తారు. కానీ కథతో పాటు వ్యాపారాన్ని కూడా పక్కాగా చూసుకొని చేసే కథానాయకుడు అక్కినేని నాగార్జున. దీనికి ఆయన గతంలో చేసిన పలు సినిమాలే సాక్ష్యాలు. అలాగే కొత్త దర్శకులను పరిచయం చేయడంలోనూ ముందుండే ఏకైక “హీరో” నాగార్జున అని చెప్పొచ్చు. ఈసారి “కళ్యాణ్ కృష్ణ” అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ, తనే నిర్మాతగా నిర్మించిన సినిమా “సోగ్గాడే చిన్నినాయనా”.…

భలే భలే మగాడివోయ్ (2015)

మాములుగా చిత్రసీమలో తప్పటడుగు వేస్తే, దాన్ని వెనక్కు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ దర్శకుడు “మారుతి” విషయంలో అది తప్పని ఋజువయ్యింది. “ఈరోజుల్లో”, “బస్టాప్” లాంటి కథలను సరైన కథనాలతో చెప్పక, చెడ్డపేరు సంపాదించుకున్న మారుతి ఈసారి “భలే భలే మగాడివోయ్” అనే చిత్రంతో తనపై ఉన్న నిందలను తొలగించుకునే ప్రయత్నం చేశాడు. నాని, లావణ్య త్రిపాఠి జంటగా గీతా ఆర్ట్స్ 2 పతాకంపై “బన్నీ వాస్” నిర్మించిన ఈ చిత్రపు విశేషాల్లోకి వెళ్తే… కథ…